వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.