రూ.2 లక్షల మ్యాక్‌బుక్ పోగొట్టుకున్న యువకుడికి తిరిగిచ్చిన ఆటో డ్రైవర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్ణాటక

బెంగళూరులో భారీ వర్షంలో బైక్ నుంచి జారిపడిన రూ.2 లక్షల విలువైన మ్యాక్‌బుక్‌ను ఓ ఈ-రిక్షా డ్రైవర్ భద్రపరిచి యజమానికి సురక్షితంగా అందజేశాడు. హర్షిత్ సురేక అనే ప్రయాణికుడు తన బాక్స్ పడిపోయినట్లు గుర్తించి ఆందోళన చెందగా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా డ్రైవర్ శివమ్ రాజ్ అతన్ని సంప్రదించి ల్యాప్‌టాప్‌ను తిరిగిచ్చాడు. రివార్డ్ తీసుకోకుండా నిజాయితీ చాటుకున్న డ్రైవర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.