నర్సీపట్నంలో ఘనంగా జయహో బీసీ బహిరంగ సభ
రిపోర్టర్: అశోక్
స్థలం: అనకాపల్లి
నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు కృతజ్ఞతగా రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఈ సభను ఏర్పాటు చేశారు. బీసీల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.