భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ వైదొలుగుతున్నట్లు ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. టెస్టులు, వన్డేలు, టీ20ల సారథ్య బాధ్యతల నుంచి ఆమె వైదొలగడంతో జట్టు తదుపరి కెప్టెన్ ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త నాయకత్వం ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకోబోయే నిర్ణయంపై ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.