తిరుమలలో అత్యాధునిక సాంకేతికతతో డివోషనల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: తిరుపతి
తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన ‘డివోషనల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. కృత్రిమ మేధ, వర్చువల్ రియాలిటీ సాంకేతికతలతో శ్రీవారి చరిత్ర, వైభవాన్ని ఈ కేంద్రంలో ఆవిష్కరించనున్నారు. క్యూలైన్లలో భక్తుల నిరీక్షణ సమయాన్ని ఆధ్యాత్మిక అనుభూతిగా మలచడానికి తితిదే ఈ వినూత్న ప్రాజెక్టును రూపకల్పన చేసింది.