దేశంలో ఏడు రైల్వే కారిడార్ల ఫోర్-లేన్ విస్తరణకు కేబినెట్ ఆమోదం

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

దేశంలోని ఏడు కీలక రైల్వే కారిడార్లను ఫోర్-లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.10,783 కోట్ల అంచనా వ్యయంతో 5 రాష్ట్రాల్లో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఘట్‌కేసర్-కాజీపేట మధ్య నాలుగో లేన్, అరక్కోణం-రేణిగుంట మధ్య మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.