జగిత్యాలలో బడా మిల్లర్ల బరితెగింపు: అధికారులపైనే రిట్ పిటిషన్ల దాఖలు

రిపోర్టర్: విజయ్ స్థలం: Jagityal

జగిత్యాల జిల్లాలో బడా మిల్లర్ల వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారిందని స్థానిక సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు మరియు సీఎంఆర్ అక్రమాల నేపథ్యంలో డిఫాల్ట్ జాబితాలో ఉన్న సదరు మిల్లుకు ఈ సీజన్ లో ధాన్యం కేటాయించకూడదని అధికారులు నిర్ణయించారు. నిబంధనల ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధికారులపైనే రిట్ పిటిషన్లు వేయడం మరియు కోర్టు ఆర్డర్ల పేరుతో ఒత్తిడి తీసుకురావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.