రాజుపాలెంలో అదుపుతప్పి బోల్తాపడిన లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రాజుపాలెం

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి వద్ద శుక్రవారం తెల్లవారుజామున లారీ బోల్తాపడింది. సచివాలయం సమీపంలోని మలుపు వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి పక్కకు తిరగడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.