ఏలేరు రిజర్వాయర్లో చేప పిల్లల విడుదల: మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ఏలేశ్వరం
ఏలేశ్వరం మండలంలోని జె.అన్నవరం గ్రామంలో ఏలేరు రిజర్వాయర్లో మత్స్యశాఖ అధికారులు పదకొండు లక్షల నలభై వేల చేప పిల్లలను గురువారం సాయంత్రం విడుదల చేశారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.