మహిళా కండక్టర్ మృతితో టీజీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం: అన్ని బస్సులకు తలుపులు తప్పనిసరి
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
మహిళా కండక్టర్ ప్రవళిక మృతి నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇకపై అన్ని ఆర్టీసీ బస్సులకు తలుపులు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని డోర్లు క్లోజ్ చేసిన తర్వాతే బస్సులు ముందుకు కదలాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.