ఖమ్మంలో విద్యార్థి సంఘాల నిరసన.. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు ఇటికాల రామకృష్ణ, చింతల రమేష్ మాట్లాడుతూ, ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.