గోవాలో డ్రగ్స్ కట్టడిలో బీజేపీ విఫలమైందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: గోవా

గోవాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెరుగుతోందని, ఈ సమస్యను అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో పట్టుబడుతున్న డ్రగ్స్కు గోవా కేంద్రంగా మారిందని, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని గోవాలో ఎందుకు అమలు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా నిలదీశారు.