లక్ష్యం, పట్టుదలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు: శైలజా కిరణ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
స్పష్టమైన లక్ష్యం, పట్టుదల ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ సీఈఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని తన ప్రయాణాన్ని పంచుకున్నారు. ప్రజల సొమ్మును నిర్వహిస్తున్నందున మార్గదర్శికే తన జీవితంలో తొలి ప్రాధాన్యమని తెలిపారు. వ్యాపారం మగవారికి మాత్రమేననే సంప్రదాయం మారుతోందని, మహిళలూ క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.