ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: నరేష్
స్థలం: తాడేపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాజకీయ హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకాలు, అక్రమ కేసులపై పార్టీ శ్రేణులు పక్కా ఆధారాలు సేకరించి ప్రతిఘటించాలని జగన్ స్పష్టం చేశారు.