షాకింగ్ ఘటన: మనవరాలిని కాపాడబోయి మనుమడి చేతిలో తాత మృతి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Palakkad

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా అలత్తూరు ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన చెల్లెలిపై దాడి చేస్తున్న మనుమడిని అడ్డుబోయిన సులైమాన్ అనే అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడిపై మనమడు కత్తితో విచక్షణా రహితంగా పొడవడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ అంతులేని విషాద ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.