క్యాన్సర్ చికిత్స తర్వాత గుండె ఆరోగ్యంపై డాక్టర్ శరణ్ హల్లాడ్ హెచ్చరిక

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత కూడా రోగులు తమ గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్డియాక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ శరణ్ హల్లాడ్ తెలిపారు. కీమోథెరపీ మరియు రేడియేషన్ ప్రభావాల వల్ల భవిష్యత్తులో గుండె కండరాలు బలహీనపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సర్వైవర్లు క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలని, జీవనశైలిలో మార్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్చరించారు.