ఈసీపై ప్రతిపక్షాల విమర్శలను తీవ్రంగా ఖండించిన మంత్రి లోకేశ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విశాఖపట్నం

ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ అనే తేడా లేకుండా తాము ఎప్పుడూ వాస్తవాలు మరియు డేటా ఆధారంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు. కర్ణాటక, తెలంగాణ, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం ఓడినప్పుడే ఎందుకు వస్తుందని ప్రశ్నించిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిరాధార విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.