మర్పల్లిలో భయానక ఘటన: పంట పొలంలోకి వచ్చిన భారీ మొసలి హల్చల్

రిపోర్టర్: రమేష్ స్థలం: మర్పల్లి

మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల గ్రామంలో పంట పొలంలోకి భారీ మొసలి రావడంతో కలకలం రేగిందని, షెడ్డు వద్ద సేదతీరుతున్న జలచరాన్ని చూసి రైతు మొగులయ్య హడలెత్తిపోయారని స్థానికులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి వేళ వాగు నుంచి దారితప్పి పొలంలోకి ప్రవేశించిన ఈ మొసలిని రైతులంతా ఐక్యంగా కర్రల సాయంతో తాళ్లతో సురక్షితంగా బంధించారు. పొలాల్ లో మొసలి ప్రత్యక్షం కావడంతో అన్నదాతలు తీవ్ర భయాందోళనకు గురవుతుండగా, అటవీ అధికారులు స్పందించి దానిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.