న్యూయార్క్ సబ్ వే పట్టాలపై భారత సంతతి యువతీయువకుల దుర్మరణం
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూయార్క్
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇద్దరు భారతీయ సంతతి యువతీయువకులు మృతి చెందారు. లోయర్ మన్‌హాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో నవమ్ కౌల్ పట్టాలపై పడిపోగా, అతడిని రక్షించేందుకు వెళ్లిన మలైకా చిత్ర కూడా అదే పట్టాలపైకి దూకారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన సబ్‌వే రైలు వారిని ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు మరియు అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.