స్థానిక ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం కేటాయింపు: నారా లోకేశ్

రిపోర్టర్: శివ స్థలం: మంగళగిరి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనీసం ముప్పై నాలుగు శాతం స్థానాలు కేటాయిస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా ఓటమి భయంతోనే సుప్రీంకోర్టుకు వెళ్లిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో బీసీల హక్కుల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.