పాలమూరు నీటి తరలింపు కుట్రపై బీజేపీ ఎంపీ డీకే అరుణ నిప్పులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Mahabubnagar

పాలమూరు జిల్లాల రైతులకు కేటాయించిన సాగునీటిని డిండి ఎత్తిపోతల పథకానికి తరలించి స్థానిక రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహబూబ్నగర్లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కికోకపోతే ఉగ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.