స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధంకావాలని కూటమి నేతలకు చంద్రబాబు పిలుపు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూటమి శ్రేణులు సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పట్టణ ఎన్నికల్ లో సాధించిన తొంభై నాలుగు శాతం స్ట్రైక్‌రేట్‌ను మించి స్థానాలు దక్కించుకోవాలని దిశానిర్దేశం చేశారు. పొత్తు ధర్మం పాటించని వారికి పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేశారు. మిత్రపక్షాల మధ్య ఐక్యత చెడిపోకుండా సమష్టిగా పనిచేయాలని టెలీకాన్ఫరెన్స్ వేదికగా ఆయన తేల్చిచెప్పారు.