జాతీయ రహదారులపై ఆటోమేటిక్ టోల్ విధానాన్ని ప్రకటించిన ఎన్హెచ్ఏఐ
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో త్వరలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులపై వాహనాలు ఎక్కడా ఆగకుండానే ఎలక్ట్రానిక్ విధానంలో టోల్ వసూలు చేసేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాబోయే నాలుగు మరియు ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ హై-స్పీడ్ కారిడార్లలో ఈ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడంతో పాటు రద్దీ తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.