దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసుల పాశవిక దాడి తీవ్ర కలకలం
రిపోర్టర్: హరి
స్థలం: వరంగల్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దుస్థితిపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు పాశవికంగా దాడి చేశారు. కడుపులో తన్ని, చేయి విరగ్గొట్టి, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడం, పైకప్పులు పెచ్చులూడటం, ఆంబులెన్స్ ల కొరత వంటి సమస్యలపై నిలదీసినందుకు ఈ దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది.