పెద్దయ్య దేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దండేపల్లి
దండేపల్లి మండలంలోని పెద్దయ్య దేవున్ని పలు గ్రామాలకు చెందిన భక్తులు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం వారు కుటుంబ సభ్యుల సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేశంతో పాటు రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటూ వారి పూజలు నిర్వహించారు. కాగా బీజేపీ కిసాన్ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గోపతి రాజయ్య పెద్దయ్య దేవుడికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.