ఎన్ని సీట్లు గెలిచారు: కాంగ్రెస్ పరాజయంపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రల పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ సెటైర్ వేశారు అని రాజకీయ వర్గాలు తెలిపాయి. బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. ఈవీఎంల వివాదం నడుమ ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.