వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నేడు అధికారుల బృందం పర్యటన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించేందుకు సీఎంవో కార్యాలయం నుంచి ఐఏఎస్ అధికారుల బృందం నేడు రానుంది. మొదట వరంగల్ ఎన్ఐటీకి చేరుకుని, అక్కడి నుంచి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి, నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనతో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.