డోర్నకల్ అభివృద్ధి పనులపై కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మిక తనిఖీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ టెంపుల్ జంక్షన్ ప్రాంతంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, రోడ్డు వైండింగ్ మరియు మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ (Collector Mahabubabad) స్నేహ శబరిష్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.