తిరుమల లడ్డూ కల్తీ కేసు: సుప్రీంకోర్టులో ప్రైవేట్ డెయిరీ పిటిషన్ తిరస్కరణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించిందని అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధి నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ప్రైవేట్ డెయిరీ ఎండీ మశ్చీంద్ర శాంతారామ్ దాఖలు చేసిన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న విచారణ ప్రక్రియ యథావిధిగా ముందుకు సాగనుందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు.