స్థానిక ఎన్నికల వేళ కళకళ: తప్పెటగుళ్ల తయారీతో ఉపాధి పొందుతున్న కళాకారులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Anakapalli
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొనడంతో ప్రచారంలో వాడే తప్పెటగుళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి చెందిన కళాకారుడు దమ్ము ప్రభాకర్‌రావు గత నాలుగు దశాబ్దాలుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. తమ కుటుంబం వందేళ్లకుపైగా ఇదే వారసత్వ కళను నమ్ముకుని బతుకుతున్నట్లు ఆయన ఆవేదన, ఆనందం మేళవించి తెలిపారు. ప్రస్తుతం పెరిగిన గిరాకీతో తమకు తగిన ఉపాధి దొరుకుతోందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.