వినాయక నిమజ్జనం కోసం ర్యాపిడో బైక్ బుక్ చేసిన మహిళ
రిపోర్టర్: సతీష్
స్థలం: నెల్లూరు
నెల్లూరులో వినాయక నిమజ్జనం కోసం ఓ మహిళ వినూత్న రీతిలో ఆలోచించి ర్యాపిడో బైక్ డెలివరీ రైడర్‌ను బుక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పూజించిన విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆమె ఈ మార్గాన్ని ఎంచుకుంది. రైడర్ మొదట ఆశ్చర్యపోయినా, ఆ మహిళ భక్తి భావాన్ని అర్థం చేసుకుని విగ్రహాన్ని దగ్గరలోని నది వద్దకు తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.