వైద్య సేవలకు అంతరాయం కలిగిస్తున్న నర్సంపేట ఆసుపత్రి కరెంటు కష్టాలు

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా సమస్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో కరెంటు ఉన్నా ఆసుపత్రిలో తరచూ విద్యుత్ పోతుండటంతో రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వేళల్లో జనరేటర్ వినియోగించాల్సి ఉండగా డీజిల్ లేదని సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం. దీంతో రాత్రివేళల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.