ఈసీపై కాంగ్రెస్ డ్రామా: రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సెటైర్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై కాంగ్రెస్ పార్టీ నకిలీ పార్లమెంట్ పేరుతో డ్రామా ఆడుతోందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్ లో ఓడిపోయామనే అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వ మార్పు కోసం కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ఆ నకిలీ పార్లమెంట్ కు ప్రధానిని చేసుకోవాలని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.