యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న దే ఫడ్నవీస్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ముంబై
మహారాష్ట్ర యువతకు ఇరవై ఎనిమిది దేశాల్లో అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి దే ఫడ్నవీస్ వెల్లడించారు. ముంబైలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మహా రోజ్‌గార్ మేళాను వర్చువల్ విధానంలో ప్రారంభించి ఆయన మాట్లాడారు. కేవలం డిగ్రీలు పొందడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కొంకణ్, నాసిక్ డివిజన్లలో ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నట్లు నైపుణాభివృద్ధి శాఖ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా తెలిపారు.