సౌదీ అరేబియా విమానాశ్రయంపై దాడి: భారతీయుడు మృతి చెందడంతో కలకలం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: రియాద్
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. ఈ దుర్ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని అధికారులు వెల్లడించారు. త్వరలోనే మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.