చిన్నారుల భద్రతకై పాఠశాలలో సాగిన అవగాహన వేడుక

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ ఇర్విన్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినీ, విద్యార్థులకు బాలల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై షీ టీం ఇంచార్జి జగదీశ్వర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ జ్యోతి మాట్లాడుతూ చిన్నారులు ఎదుర్కొనే వేధింపులు, అనుచిత స్పర్శపై ప్రతి విద్యార్థి అప్రమత్తంగా ఉండాలని, ఆపద సమయంలో 112 నంబర్ను సంప్రదించాలని సూచించారు.