మరాఠీ వివాదంలో సంజయ్ దత్ పాత వీడియో వైరల్!
రిపోర్టర్: హరి
స్థలం: മહારాష్ట్ర
ముంబైలో దహీ హండీ వేడుకలో మరాఠీ మాట్లాడనని చెప్పిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాపరాజీలతో ఆయన సరదాగా మరాఠీలో మాట్లాడిన ఆ క్లిప్ నెట్టింట చర్చకు దారితీసింది. జైలులో కూడా మరాఠీ నేర్చుకోలేదంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వీడియో బయటపడింది.