మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలం శెట్టి వీరభద్రం ఎన్నిక
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జెడ్పీ సెంటర్లో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ సమావేశంలో శీలం శెట్టి వీరభద్రం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధి కోసం సభ్యులంతా ఐక్యతతో కృషి చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు మరియు ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.