తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ త్యాగాలు నిత్యం ఆదర్శమని రాజాపేటలో నాయకుల నివాళులు!
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్, పిఎసిఎస్ ఛైర్మన్ నమ్మిన మహేందర్ గౌడ్లతో పాటు అఖిలపక్ష నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం, త్యాగాలు నేటి తరాలకు నిరంతరం స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.