హైదరాబాద్‌లో రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లో టీసీఎస్ హైపర్‌వాల్ట్ సంస్థ రూ.70,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. 250 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుతో 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం, తెలంగాణను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా కీలక అడుగు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.