రాజకీయ పార్టీ ఎప్పుడంటూ ప్రశ్నిస్తే నవ్వి ఊరుకున్న హీరో ధనుష్

రిపోర్టర్: సతీష్ స్థలం: చెన్నై

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ ప్రవేశంపై చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన చిరునవ్వుతో సమాధానమిచ్చారు. రాయన్ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంతో ప్రయాణమవుతున్న సమయంలో రిపోర్టర్ రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటూ సరదాగా ప్రశ్నించగా ధనుష్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.