స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వైకాపా పలాయనం: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మండిపాటు

రిపోర్టర్: కిరణ్ స్థలం: నెల్లూరు

స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వైకాపా పలాయనం కోరుకుందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మండిపడ్డారు. నెల్లూరు తెదేపా జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. జగన్ కు ఓటు వేసే ఓపిక లేకపోవడం విచారకరమని, గతంలో ఎన్నికలను ఆయన ఎలా నిర్వహించారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను అవమానించారని, రాష్ట్ర ప్రజలు కూటమి పాలనను కోరుకుంటున్నారని రవిచంద్ర స్పష్టం చేశారు.