జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రయాణంపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: చెన్నై

దర్శకుడు జేసన్ సంజయ్ తన తాత ఎస్.ఏ. చంద్రశేఖర్ బాటలోనే పయనిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సందీప్ కిషన్ కథానాయకుడిగా తెరకెక్కిన సిగ్మా సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు. విజయ్ కుటుంబంతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని వెల్లడించారు. జేసన్ సంజయ్ నటన వైపు రాకుండా దర్శకత్వాన్ని ఎంచుకోవడం వెనుక ఆయన వంశపారపర్య జీన్స్ ఉన్నాయని చిరంజీవి కొనియాడారు. ఈ అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.