బద్రీనాథ్ హెలికాప్టర్ ప్రమాదం: నిబంధనలను ధిక్కరించి నడిపారంటూ యూకాడ సంచలన ప్రకటన

రిపోర్టర్: గోపి స్థలం: చమోలి

బద్రీనాథ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ అదనపు ముఖ్య కార్యనిర్వహణాధికారి సంజయ్ టోలియా కీలక విషయాలు వెల్లడించారు. చెడు వాతావరణం కారణంగా విమాన సర్వీసులు నిలిపివేయాలని ప్రమాదానికి గంట ముందే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, అయితే ఆ ఉత్తర్వులను ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూర్తిగా ధిక్కరించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.