ఇరాన్ లోని కెస్మ్ దీవిపై అమెరికా దాడులు: వాషింగ్టన్ కీలక ప్రకటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

ఇరాన్ లోని కెస్మ్ దీవి లక్ష్యంగా అమెరికా బలగాలు పరిమిత దాడులు నిర్వహించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. వాణిజ్య నౌకలపై దాడులను నిరోధించేందుకే టెహ్రాన్ పై ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. మరోవైపు ఇరాన్ తో చర్చల ద్వారా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని జెడి వాన్స్ తెలిపారు.