కరెంట్ కోతలతో సూర్యాపేటలో ఎండిపోతున్న పంట పొలాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో కరెంట్ కోతల తీవ్రత కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో పాటు పంట పొలాలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం కేవలం 7 నుండి 8 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తోందని, అది కూడా నాలుగు విడతలుగా వదలడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రిపేర్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.