బెంగళూరులో నకిలీ మందుల గుట్టు రట్టు చేసిన ఎఫ్‌డీఏ అధికారులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెంగళూరు

కర్ణాటకలోని బెంగళూరులో నకిలీ మందుల తయారీ, విక్రయాల దందాను రాష్ట్ర ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ అధికారులు బట్టబయలు చేశారు. బెంగళూరు సౌత్ జిల్లా బిదది పరిధిలోని కురుబరకేరనహళ్లిలో ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించి రూ.5.05 కోట్ల విలువైన నకిలీ మందులు, యంత్రాలను జప్తు చేశారు. ఈ అక్రమాలకు పాల్పడిన 16 సంస్థల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు ప్రముఖ ఫైజర్ డిపోతో సహా మరో 8 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు.