అమెరికాలో గ్రీన్ కార్డు దరఖాస్తులపై భారీ నిషేధం: ఐటీ దిగ్గజాలకు షాక్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమెరికా
అమెరికాలో విదేశీ ఉద్యోగుల గ్రీన్ కార్డు దరఖాస్తులను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ తెలిపారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఎనిమిది ప్రముఖ ఐటీ సంస్థల పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నామని ఆయన వెల్లడించారు. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పష్టం చేశారు.