కేజీబీవీలో ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన కలెక్టర్
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాలలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి వసతులను పరిశీలించారు. విద్యార్థినులకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు. పాఠశాలలో జరుగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.