పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : గురాన రాధిక
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జనసేన పార్టీ నాయకులు గురాన రాధిక అయ్యలు కోరారు. విజయనగరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు జీఎస్ఆర్ హోటల్ వద్ద వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.